'క్రాలీ ఆత్మ అక్కడే ఉంది'.. ఇంగ్లండ్ బ్యాటింగ్ వైఫల్యంపై ఐస్లాండ్ సెటైర్
- న్యూజిలాండ్‌తో టెస్టులో 140 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్
- ఇంగ్లిష్ బ్యాటింగ్ వైఫల్యంపై ఐస్లాండ్ క్రికెట్ సెటైర్
- బ్యాటర్ జాక్ క్రాలీని ఉద్దేశిస్తూ పెట్టిన పోస్ట్ వైరల్
- ఒంటరి పోరాటం చేసిన హ్యారీ బ్రూక్
- తొలి ఇన్నింగ్స్‌లో కివీస్ బౌలర్ల పూర్తి ఆధిపత్యం
ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ ప్రదర్శన తీవ్ర నిరాశపరిచింది. గురువారం జరిగిన మొదటి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ జట్టు కేవలం 140 పరుగులకే కుప్పకూలింది. మైదానంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయారు.
ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే ఐస్లాండ్ క్రికెట్ తనదైన శైలిలో ఒక ఘాటు ట్వీట్ చేసింది. "మీరు జాక్ క్రావ్లీని ఇంగ్లండ్ జట్టు నుంచి తొలగించి ఉండవచ్చు, కానీ అతడి ఆత్మ ఇంకా అక్కడే ఉంది" అంటూ రాసుకొచ్చింది. ఈ మూడు టెస్టుల సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో ఓపెనర్ జాక్ క్రావ్లీని ఇంగ్లండ్ సెలక్టర్లు పక్కనబెట్టారు. అతడు ప్లేయింగ్ ఎలెవన్‌లో లేకపోయినప్పటికీ, ఇంగ్లండ్ టాప్ ఆర్డర్ బ్యాటింగ్ పతనం చూస్తుంటే క్రావ్లీ ఆటతీరే గుర్తొస్తోందంటూ ఐస్లాండ్ క్రికెట్ వేసిన ఈ సెటైర్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.
వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆటలో ఇంగ్లండ్ 24 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ పేస్ అటాక్ ధాటికి ఏ ఒక్క బ్యాటర్ కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు. విలియం ఓరూర్కే, కైల్ జేమిసన్ తమ పేస్, స్వింగ్‌తో ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. ఆ తర్వాత నాథన్ స్మిత్ కూడా వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను మరింత కష్టాల్లోకి నెట్టాడు. బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, జేమీ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లందరూ ఘోరంగా విఫలమయ్యారు.
ఇంగ్లండ్ జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. వికెట్లు పడుతున్నా పట్టుదలతో ఆడిన బ్రూక్ 56 పరుగులు చేశాడు. తన ఇన్నింగ్స్ సమయంలో రెండుసార్లు క్యాచ్ డ్రాప్ రూపంలో లైఫ్ లభించినా, అతడు జట్టును పెద్ద స్కోరు వైపు నడిపించలేకపోయాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ కాసేపు క్రీజులో నిలిచినా.. కేన్ విలియమ్సన్ సెకండ్ స్లిప్‌లో పట్టిన అద్భుతమైన వన్-హ్యాండెడ్ క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. చివరకు 140 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్ అవడంతో న్యూజిలాండ్ జట్టు ఈ మ్యాచ్‌పై పూర్తి పట్టు సాధించింది.